Sunday, June 27, 2010

శ్రీశ్రీ

శబ్దానికి ప్రాణంపోసి
భావానికి రూపం ఇచ్చే
మొనగాడెవడయ్యా అంటే
అతడేలే శ్రీశ్రీ, అతడేలే శ్రీశ్రీ
ఛందస్సుని ఛాందసమంటూ
కవితావేశం కావాలంటూ
గురజాడకు నివాళులిస్తూ
తను చేసిన పథనిర్దేశం
బ్రతికించెను తెలుగు కవితనే
సామాన్యుని జన హృదయంలో

సామాన్యుని జీవన గమనం
నిజమైన చరిత్రసారమని
సంధించిన సూటిప్రశ్నలు
చేసాయోయ్ కృష్ణతాండవం
పాలకులనే కాళీయులపై

సామాన్యుని బాధని కంటూ
తను చేసిన హాహాకారం
నేనున్నా మీకోయ్ అంటూ
చూపించిన హృదయావేశం
నింపెనులే జీవనస్ఫూర్తిని
జీవచ్చవ జనహృదయంలో

అందుకే,
నేనుసైతం అశ్రువొక్కటి ధారపోస్తాను, ఆ మహాకవి స్మరణలో
నేను సైతం వెర్రిగొంతుక నిచ్చి మోస్తాను, ఆ మహాకవి కీర్తిని

Sunday, June 20, 2010

ప్రత్యూషం

నులు వెచ్చని కిరణాలతో భానుడు భాసిస్తూ

ప్రకృతికాంతకు ఇచ్చిన ముద్దేలే ప్రత్యూషం!

నును సిగ్గుల బుగ్గల సింధూరం

నుదుటున మెరిసే తిలకం పూసుకుని

ఎర్రబడ్డ రవి మోమే అందుకు సంకేతం

ముద్ధులతో రమించి ప్రకృతి ప్రసవించే నవజీవం

తన బిడ్డపాప ఆలనలో అదమరిచిన ప్రకృతిపై

భగ భగ తాపంతో చిటపట కోపంతో భగ్గుమనె భానుడు

తన పరిమళ గంధంతో తన సఖుని సేదతీర్చెనారమణి

తన ఇష్ట సఖి సేవలో(తో) సంతసించి చల్లబడ్డ భానుడు

ప్రకృతి కాంత వడిలో ఆదమరిచి నిదురించే!


Friday, June 18, 2010

అసత్యం

'సత్యమనే' సాకుతో ఇంతిని అమ్మినాడు హరిశ్చంద్రుడు

'అసత్యాన్నే' అయుధంగ రాజ్యాన్నే రక్షించె చాణక్యుడు

పడతిపడ్డ కష్టానికి కారణం 'సత్యమే'

రాజ్యకాంత రక్షణెనుక దాగున్నది 'అసత్యమే'

సత్యమైనా అసత్యమైనా మనిషి పలికే మాటలే

మనుషులకే మాటలున్నది మానవతను పెంచుటకే