Thursday, June 17, 2010

గీతాంజలి - Where the mind is with out fear అనువాదం

భీతిలేక మనిషి ఎచట శిరమునెత్తి నిలుచునో

సర్వజనులకు ఙ్ఞానమెచట అందుబాటునుండునో

సంఘ మెచట సంకుచిత భావజాల అసంఘటితమవ్వదో

మనిషి మాట ఎచట సదా సత్యమై పలుకునో

కార్యశూరుని కరములెచట పరిపూర్ణతకై పరితపించునో

మూఢచార మావిచేత మూయబడక తర్కమెచట తళుకుమని మెరియునో

మనుషులెక్కడ ఎల్లప్పుడు ఎదుగుచున్న క్రియాశీల భావకులైయుందురో

ఓ నా తండ్రీ! ఆస్వాతంత్ర స్వర్గసీమ నాదేశమై వెలగనీ

1 comment:

  1. Greatness of Gitanjali is candidly translated...
    loved it.....!!

    ReplyDelete