Friday, December 25, 2009

లేవరోయి తెలుగు వీరుడా

లేవరోయి తెలుగు వీరుడా
మనసుని కమ్మిన మౌఢ్యపు నీడను
వీడి వెలగవొయి తెలుగు ధీరుడా
బతుకుటకే ఈ నేలరా,
బతుకును వీడి సాగుటేలరా!

శాంతి లేక ప్రగతి లేదురా,
ప్రగతి లేని బతుకు ఆగురా
అలజడి రేగిన మనస్సులతో
అక్కర తీరునా సోదరా
యోచన కందని కృత్యం కలదా కానరా
మదిలో మెదిలే ఊహల స్వప్నం తీరే మార్గం వెదకరా
స్వప్న సౌధపు మార్ఘదర్శివి నీవై ముందుకు సాగరా

"పూను స్పర్ధను విధ్యయందే
వైరముల్ వాణిజ్యమందే"
అన్న అడుగుజాడ నీదిరా
వారసత్వపు ఘనఫలములు ఎరిగి నీవు మెలగరా
తియ్యని తేనెల తెలుగు పలుకుకు మకుటంనీవై ఎదగరా

లేవరోయి తెలుగు వీరుడా
మనస్సుని కమ్మిన మౌఢ్యపు నీడను
వీడి సాగవోయి తెలుగు ధీరుడా

1 comment:

  1. Really great inspiring word puzzling.........
    Want these kind of interesting poems more & more...............
    Very pleasing while reading.......:):)

    ReplyDelete