Tuesday, August 4, 2009

మనిషిని దేవుడు చేసాడా లేక దేవుడిని మనిషి చేసాడా?

ఏమిటి ఈ పిచ్చోడు పందెం అంటాడు మళ్ళీ మెట్ట వేదాతం చెబుతాడు అనుకుంటున్నారా, సరే అక్కడికే వస్తున్నాను! ఈ పందెం అలాంటిలాంటి పందెంకాదు మీ హృదయంతో మీరేవేసుకునే పందెం!. నెను చేస్తుందల్లా నా అలోచనలను పంచుకోవటమె. సరె విషయంలొకి వస్తె ఈసారి పందెం దేవుడున్నాడనే భావన మీద.

ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి నిజం అయితే రెడవది తప్పు అవుతుంది ఎక్కడో అక్కడ మొదలుపెట్టాలి కాబట్టి దెవుడు వున్నాడనుకుందాము , దేవుడే మనిషిని చేసాడనుకుందాము. అప్పుడు మనం మన హృదయానికి నిరూపించలి. ఇక్కడ మనకు రెండు దారులు వున్నాయి. మొడటిది నమ్మకం రెడవది తర్కం (రీజనింగ్). ఏపని ప్రారంభించినా నమ్మకంతో మొదలెట్టాలి అంటారు కనుక పై ప్రశ్నలకి విస్లేషణ నమ్మకంతో ప్రారంభిద్ధాం!

దెవుడు వున్నాడని మనం నమ్మితే నమ్మకం అంటే ఏమిటో మనకు తెలియాలి. నమ్మకం అంటే ఒక విషయాన్ని అంగీకరించటం. దీనికి ఒప్పుకుటే ముదుకు సాగుదాము. ఆంటే దేవుడు వున్నాడని మనం ఒప్పుకుందాము. మరి దేవుడు ఏలా వుంటాడు? ఆతని పని ఏమిటి ఇలా అనేక ప్రశ్నలు, ఈ ప్రశ్నలన్నిటికీ మన నమ్మకాలు మనకుంటాయి. ఆంటే ప్రతి వ్యక్తి నుండి వ్యక్తికి నమ్మకం మారుతుంటుంది. అంటే ఎవరి దేవుడు వారికి వున్నాడు, మరి దేవుడిని ఎవరు చేసారు? ప్రతి వ్యక్తీ అంటె మనిషి, మనుషులు ఒక్క దేవుడిని కాదు అనేక దేవుళ్ళని చేసారు.

ఇప్పుడు తర్కంతో దేవుడిని వెతుకుదాము. తర్కం అంటే నిజ నిర్ధారణ. మనకి తెలియక పోతె తెలిసిన వారిని అడగాలి. వాళ్ళు చెప్పింది ఏదయినా ప్రత్యక్షంగా ధృవీకరించాలి. మనకి తెలీదు కాబట్టి తెలిసిన వారిని అడిగితే చాలా మంది చాలా చెబుతారు. సరే చూపించు అంటే మనం చూడలేము అంటారు. సైన్సు కూడా చాలా విషయాలు చుడలేదు, మరి మన చిక్కు ప్రశ్న తీరేదెలా!, అందుకు మనకున్న మార్గమల్లా దేవుడు మనిషిని చెస్తే ఎప్పుడు చెసాడు? ఏలా చేసాడు అని అడగటం. దీనికి దేవుడు వున్నాడని చెప్పే ప్రతివారూ అనేక సమాధానాలు ఇస్తారు. ఇవి ఒక్కటీ మన తర్కానికి నిలవలేవు. కబట్టి ఇలా చెప్ఫె వాళ్ళే దేవుడిని చెసారు అని చెప్పటానికి సందేహము అక్కర లేదు
కొతమంది మాకు తెలీదు కాని దేవుడు ఈ జగత్తుని అంతా నడిపిస్తున్నాడు ఆంటారు. మరి ఇలా ఏందుకు నడిపిస్తున్నాడు అంతే వేరువేరు కారణాలు.... ఎవరవి వారికున్నాయి, అంటే మళ్ళా వీళ్ళే దేవుడిని చెసారు అని తేలుతుంది.
నేను ఇలాంటి దేవుడినే నమ్ముతాను. నాకున్న నమ్మకాలు నాకు మాత్రమే పరిమితం, నాకు మచి చేస్తాయి, ధైర్యాన్ని, ఆనంధాన్ని ఇస్తాయి, కాని కొందరు వారి నమ్మకాలను అందరూ నమ్మేటట్లు చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఏమయినా తెలుసుకోవాలంటే వారే ఆదారం అవుతారు. ముఖ్యంగా మనం వాళ్ళని నమ్మటం ప్రారంభిస్తాం, మనదేవుడు వారి దేవుడుగా మారి పోతాడు, వారు మనకీ మనదేవుడికీ వారదులౌతారు. మనం మన శక్తిమేరకు వారిని తృప్తి పరుస్తాం, ఇదే మతం అయింది, నమ్మే వాళ్ళు అనుచరులైనారు!!

మీరేమవుతారు?

పందెం కాస్తారా....., కాయ్ రాజా కాయ్ !!

4 comments:

  1. I agree with the scientific reasoning..........

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. గుంపులో మైల్ లో తోటకూర,పాలకూర అంటే అదేమన్నా చెపుతారేమో అని ఆశతో వచ్చా.ఇంత పెద్ద పెద్ద విషయాలు చెప్పేస్తారా ....హన్నా....

    ReplyDelete
  4. http://pradeepblog.miriyala.in/2008/04/blog-post.html
    పైన ఉన్న లింకు మతం గురించే అయినా.. మీ టపాకు దగ్గరగా ఉంటుంది. కనుక అదే నా వ్యాఖ్యగా భావించండి

    ReplyDelete