Thursday, August 6, 2009

ఆంధ్రావని

ఆంధ్రావని ఇదేనురా! ఆంధ్రావని ఇదేనురా!
తియ్యని తేనెల పలుకుల కులుకులు ఇవేనురా! ఇవేనురా!

స్వరాలు రాగాలై, పదాలు తాళాలై
సాగర కెరటాలే బసవన్న నాట్యాలై
కోయిల పాటతో కూచిపూడి ఆడినా
బక్తియే రక్తియై హరిదాసు గీతాలే ఆలపించినా

ఆంధ్రావని ఇదేనురా! ఆంధ్రావని ఇదేనురా!
తియ్యని తేనెల పలుకుల కులుకులు ఇవేనురా! ఇవేనురా!

కృష్ణవేణి తీరాన బంగారు పంటలు
గోదావరమ్మ ఇచ్చేటి రతనాలు
తుంగబద్రమ్మ! పెన్నమ్మ, స్వర్ణముఖీ,
నదులన్నీ పరిగేడుతూ పాడినా!

ఆంధ్రావని ఇదేనురా! ఆంధ్రావని ఇదేనురా!
తియ్యని తేనెల పలుకుల కులుకులు ఇవేనురా! ఇవేనురా!

భాగ్యనగర పరిశ్రమల పతాక రెపరెపలు
విశాఖ పట్టణాన, విజయవాడలో వాణిజ్య కేద్రాలు,
ఒంగోలు కేద్రంగా పాడి పరిశ్రమలు
నెలకున్న భాగ్యసీమ మనదేనురా! మనదేనురా!


అందుకే!!

తిరుపతి కోండలమీద శ్రీనివాసుడు!
ఇంద్రకీలాద్రిపైన అమ్మ దుర్గమ్మ!
స్వర్ణముఖీ తీరాన కాశహస్తీశ్వరుడు!
మంత్రాలయంబున వెలిసిన రాఘవేంద్రుండు
వేల్పులన్నీ నడచి వచ్చి కోలువైనవి మన ఇంట
వేల్పులన్నీ నడచి వచ్చి కోలువైనవి మన ఇంట

ఆంధ్రావని ఇదేనురా! ఆంధ్రావని ఇదేనురా!
తియ్యని తేనెల పలుకుల కులుకులు ఇవేనురా! ఇవేనురా!

No comments:

Post a Comment