Tuesday, August 11, 2009

నిరాశెందుకు నేస్తం!

చీకటిని చీల్చి ఉషస్సు ఉత్తేజాన్నిస్తే,
తన చాయని కప్పి చీకటి నిన్ను సేద తీరుస్తుంది

మాటల తూటాలకు మౌనం కవచం వేస్తే,
భావాలను తెలపటానికి భాష ప్రయత్నిస్తుంది

చుక్కలు మెరిసే నింగి నీ మనస్సుకు జీవంపోస్తే,
మబ్బులు కమ్మిన నింగే పృధ్వికి జీవాన్నిస్తుంది

గెలిచిన విజయం చిరునవ్వులు పూయిస్తే,
కలిగిన అపజయం అనుభవాన్నిస్తుంది

మరి నిరాశెందుకు నేస్తం, అవని కాదా సోంతం

2 comments:

  1. Long back I have read regularly kavitalu titled as "Nestam". I will be thankful if anybody let met know the name of writer and old content.
    ysbhaskar@gmail.com

    Thank you all

    ReplyDelete