Tuesday, August 18, 2009

నా పల్లెటూరి గీతం!

ఇదే పల్లెటూరి గీతం, నాపల్లె మదుర చరితం
హృధ్యమైన ఈ గీతం నామదిలో మెదిలే వసంతం

ఇదే పల్లెటూరి గీతం, నాపల్లె మదుర చరితం
హృధ్యమైన ఈ గీతం నామదిలో మెదిలే వసంతం
చేసాను చిలిపి పనులనే ఎన్నెన్నో నేను!
గడిపాను కాలాన్నంతా కలలా ఓ కలలా!


విన ఓపిక మీకుంటే !
నాచిన్ననాటి సంగతులెన్నో చెబుతాలే మీకు
చెబుతాలే మీకు





నేను తప్పటడుగులు వేసింది ఈ పల్లెటూరి మడిలోనే
అక్షరాలు నేర్చింది అదిగో ఆ బడిలోనే
జీవితసారం నేర్పింది ఈ గ్రంధాలయ మందిరమే
బతుకుకు బాటవేసింది అదిగో పాఠ్యాలయమే

విన ఓపిక మీకుంటే !
నాచిన్ననాటి సంగతులెన్నో చెబుతాలే మీకు
ఓనాడేమయ్యిందంటే!
మామయ్యకి మస్కాకొట్టి! మంచిగ అమ్మమ్మకి చెప్పి
చెక్కేసా క్రికెట్టు కంటూ!



మరోనాడేమో పరిక్షలని మా మామయ్య చదవమని కట్టడి చేస్తే
పుస్తకాన్నేముదరపెట్టి ! చక్కగనే కునుకు తీసా వచ్చిన పధ్యం చదువుతూ!

అట్టాగే!

నన్నో బోమ్మని చేసి! ముద్దు మురిపెమున ముస్తాబు చేసి
బడికంపితె మా పిన్నమ్మ
సాయంత్రం బళ్ళొనుంచీ మట్టి బట్టలతొ మంచిగవచ్చా
పిన్నమ్మని వెక్కిరిస్తూ



మండువేసవిన తిరగొద్దంటూ! గడియపెట్టి మామామయ్య
నిద్దురపొమ్మని తాకీదిస్తే
మామయ్యని నిద్ధురబుచ్చి పరిగెత్తా ఆటలకంటూ



ఇదే పల్లెటూరి గీతం, నాపల్లె మదుర చరితం
హృధ్యమైన ఈ గీతం నామదిలో మెదిలే వసంతం
చేసాను చిలిపి పనులనే ఎన్నెన్నో నేను!
గడిపాను కాలాన్నంతా కలలా ఓ కలలా!


No comments:

Post a Comment