Thursday, August 20, 2009

సోనామసూరి అక్కరలేదా!

వసంతకాలం వచ్చింది
కోకిల గానం నచ్చింది

కొత్త వర్షమే వచ్చింది
ఉగాది పచ్చడి తెచ్చింది
పండితులెందరో వచ్చారు
కవిత్వమెంతో చెప్పారు

ఎవడో పిచ్చోడన్నాడు
జీవితమంతా వసంతమైతే
బతుకే బంగరు పటౌతుందని

బంగరు పంటే కావాలంటె
సోనామసూరి అక్కరలేదా
కోకిల గానం నచ్చిందంటూ
తొలకరి వానని వద్దంటావా

గ్రీష్మపు ఎండలు కాయక పోతే!
తొలకరి వానలు కురవకపోతే!
చల్లని వెన్నెల కాయకపోతే!
మంచూ ఆకులు రాలకపోతే!

వసంతకాలపు ఊసేముంది
బంగరు పంటకు విలువేముంది

No comments:

Post a Comment