Monday, November 2, 2009

కాఫీ మానేశానోచ్!!

నేను కాఫీ మానేశాను, అవును మీరు విన్నది నిజమే, నాగురించి తెలిసినవాళ్ళకి నిజమా అనిపించవచ్చు, ఈ ఠపా వ్రాయటానికి ముందు 30 రోజులనుండీ కాఫీ తాగటం మానేశాను, ఓ నేను సాదించాను అని చెప్పాలని ఉన్నా నిజంగా మానేశానా అని తేలే వరకూ ఆగుదామనుకున్నాను. నిన్న కాఫీ త్రాగుదామనిపించి త్రాగుతుంటె త్రాగలేక పారబోసేశాను. ఆ ధర్యంతోటే ఈ ఠపా వ్రాస్తున్నాను.

కాఫీ ఏందుకు మానేయాలి?

౧. కాఫీ మెల్లగా ఇన్సులిన్ నిరోధాన్ని పెంచుతుంది. ప్రతిగా కాలెయం ఏక్కువ ఇన్సులిన్ ని శ్రవించటం, దానితో చెక్కెర శాతం పడిపోవటం తో మెల్లగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గించటంతో టైప్-2 డయాబెటీస్ కి కారణం అవుతుంది. చెక్కెర శాతం పడిపోవటం చెక్కెరవ్యాది తొలి లక్షణంగా భావించవచ్చు. ఉదయం టిఫిన్ కాఫీలయిపోయిన తరువాత అఫీసులో దిగగానే ఆకలివేయటం కాఫీ త్రాగపోతే పనిసాగకపోవటం వటివి ప్రదమలక్షణాలు అయివుండవచ్చు




౨. శరీరంమీద వత్తిడి పెంచుతుంది, వత్తిడివలన శరీరం సమయమనాన్ని కోల్పోతుంది. ఉదాహరణకు కాఫీత్రాగిన తరువాత మీరు చేస్తున్న పనిని తొందరగా చేయవచ్చు కానీ చేయక్కరలేని పనిని చేస్తున్నట్లయితే విరమించటం కష్టం అవుతుంది. కొచంఎక్కువసేపు మాట్లాడటం, కొంచెం ఎక్కువసేపు పనిచెయ్యటానికి కాఫీ మంచిది


౩. మీ సహజమైన అలవాట్లలో మార్పు తెస్తుంది, నిద్రకి దూరం అవటం అప్పుడప్పుదు తలనొప్పి కాఫీ త్రాగలేనప్పుడు తలనొప్పి మన జీవితంలో బాగం అవుతాయి


కాఫీ ఎలా మనెయ్యాలి?


. ముందు కాఫీ ఎందుకు త్రాగగూడదో తెలుసుకోండి, చాలా సమాచారం కాఫీ ఎక్కువ త్రాగితే మంచిదికాదుకానీ కొంచెం పుచ్చుకో వచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయి, కానీ కాఫీ వ్యసనం అని తెలుసు కోండి.

. మెదట మీరు ఎన్ని కప్పుల కాఫీ త్రాగుతున్నారో వాటిలో సగం టీ త్రాగటం ప్రారంభంచండి, లేదా గోరువెచ్చని నీళ్ళలో కొంచెం నిమ్మకాయ తేనే వేసుకుని త్రాగండి

. కాఫీ చల్లగా వున్నప్పుడు, కాఫీ వాసన వచ్చినప్పుడు త్రాగాలనిపిస్తుంది, అలా అనిపించినప్పుడు పాటలు వినండి, గోరువెచ్చని నీళ్ళు త్రాగండి
. ఒకసారి సగానికి తగ్గించాక, కాఫీ కప్పుని చిన్నది చేయండి, అంటే మీరు 2 కప్పుల కాఫీ త్రాగుతున్నట్లయితే 2 సార్లు రెండు అరకప్పుల కాఫీకి మరలండి
. ఒకసారి కాఫీ పరిమాణాన్ని తగ్గించిన తరువాత, మీరు ఇంతకు ముందు టీ త్రాగుతునట్లయితే వాటిస్తానంలో గోరువెచ్చని నీళ్ళలో తేనె కలుపుకుని త్రాగండి,
. తరువాత కాఫీ పూర్తిగా మానెయ్యండి, 30 రోజులు మానేస్తే మీరు ఈ వ్యసనం నుండీ విముక్తి అయ్యినట్లే
. మీరు ఎన్ని కప్పుల కాఫీ త్రాగుతున్నారో మీచుట్టు వున్నవారందరికీ చెప్పి, కాఫీ మానేస్తున్నానని పందెం కాయండి. మరి పందెంకాస్తారా?

No comments:

Post a Comment