Sunday, November 22, 2009

ఆత్మఘోష

నీటిమీద వెన్నెల ఊగుతుందని
కన్నులు నన్ను మోసంచేస్తున్నాయి
నింగిలో దేవుడు నన్నాడిస్తున్నాడని
మనస్సు నన్ను మోసంచేస్తున్నది
సమాజమే నన్నిలా మలిచిందని
బుద్దికూడా మోసంచేస్తున్నది

ఊగుతున్నది నీళ్ళని,
ఆడుతున్నది నేనేనని
ఎదుగుతున్నదీ నేనేనని
ఎదో ఎక్కడో ఒక ఘోష
అదేనా నాఆత్మఘోష

No comments:

Post a Comment