Saturday, December 5, 2009

పోట్టకూటి కోసం తెలంగాణమంటుంటే?

తెలంగాణా భాషంతా తెలియదునాకు
వచ్చింది సర్కారు యాసేరా నాకు
గుండెతో గుండె కలిపి సూడగా నేను
యాదయిన బావాన్నే అచ్చంగ చెబుతాను, అచ్చరంగ చెబుతాను

సర్కారోడి కొలువులు రెండు
ప్రవేటోడి కొలువులు మెండు
పోట్టకూటి కోసం తెలంగాణమంటుంటే
ఎవడి పొట్టకోసమని అడుగుతుండ నేను, అడుగుతుండ నేను


నీ బాంచెన్ కాల్మొక్తా కాలంనాడు
కమ్యునిష్టు భందూకును పట్టిందెవడు
నీ అన్నను నేనంటూ వచ్చిందెవడు
పోట్టకూటి కోసం తెలంగాణమంటుంటే
ఎవడి పొట్టకోసమని అడుగుతుండ నేను, అడుగుతుండ నేను


ఆస్తులమ్మి పరిశ్రమలు పెట్టిందెవడు
కొలువులిచ్చి, బతుకులిచ్చి బతుకుతుందెవడు
ధవాఖాన పెట్టిండా
పాఠశాల కట్టిండా
కొలువులిచ్చి బతుకునిచ్చి బతుకమ్మను పాడిండా
పోట్టకూటి కోసం తెలంగాణమంటుంటే
ఎవడి పొట్టకోసమని అడుగుతుండ నేను, అడుగుతుండ నేను

ఉధ్యమమంటూ ఊదర గొట్టి
గరీబోడి బిడ్డనేమో రోడ్డుమీదకీడ్చిండు
దొరల బిడ్డలెక్కడంటూ అడుగుతుండ నేను
పోట్టకూటి కోసం తెలంగాణమంటుంటే
ఎవడి పొట్టకోసమని అడుగుతుండ నేను, అడుగుతుండ నేను

5 comments:

  1. తెలంగాణా బాష తెలియకున్న పర్వలేదు
    తెలంగాణా ప్రజల గోస తెలిస్తె చాలు !

    సర్కారు కొలువులన్నీ మీకే నోయీ
    ప్రైవేటు కొలువులు కూడా మీకే భాయీ
    తెలంగానోడి చేతికి మిగిలింది చిప్పే తమ్మీ !!

    తెలంగానోడి బతుకు ఇప్పటికీ ఇంకా ...
    "నీ కాల్మొక్తా బంచెనే" కదా ...!!!

    ఎవని కోసం ఆస్తులమ్మి పరిశ్రమలు పెట్టిండ్లు తమ్మీ ?
    ఎట్లా కోట్లకు పడగ లెత్తిండ్లో చూడర తమ్మీ !
    ఆ పరిశ్రమలల్ల కొలువులన్ని మీవే కదా !!
    కాసులు మీకైతే ... కాలుష్యం మాకు ... అవునా కాదా ??

    ఆనాడు "నీ అన్నను నేనంటూ" ఆదుకున్నది నీవే!
    తెలంగాణా సాయుధ పోరాటం లో పాలు పంచుకున్నది నీవే !!
    ఈనాడు మమ్ము నిలువునా దోచుకు తింటున్నదీ నీవే !!!

    నాయకుల ఆరాటం నాయకులదే తమ్మీ !
    ఆనాటే దొరలే మా ఖర్మ కొద్ది నాయకులైనారోయీ
    పారేశాను గాకు వాళ్ళ భరతం తర్వాత పడతం లేవో !!

    వాళ్ళ ఆరాటం వాళ్ళది
    మా తండ్లాట మాది
    దొంగ నాయకులకు ఛీ కొట్టు !
    తెలంగాణా ప్రజల కు మాత్రం జై కొట్టు !!

    జై తెలంగాణా
    జై ప్రజా తెలంగాణా
    జై ప్రజాస్వామిక తెలంగాణా
    జై సామ్యవాద తెలంగాణా

    ReplyDelete
  2. మీ భావాలతొ నేను ఏకీభవిస్తాను. తెలంగాణా ఉద్యమం సంకుచితమైన నాయకులచె నడపబడుతుండటం సోచనియ్యం. తెలుగు తల్లిని గౌరవించ్చలేనివాడు రేపు తెలంగాణా తల్లిని గౌరవిస్తాడు అనుకొను.

    తెలంగాణా ఇచ్చినా ఇవ్వకపొయినా తెలంగాణా లొని సామాన్య ప్రజల బ్రతుకులు మెరుగుపడతాయి అని అనుకొను. అంధ్రప్రదెశ్ లొ యెలంటి అవినీతి, లంచ్చగొండి తనం, నీచమైన రాజకీయాలు వున్నాయో, రేపు తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ రాష్ట్రాలలొ కుడా అలానె వుంటయి. వెనకబాటుతనం, నీటి సమస్య, వుద్యొగ సమస్యలలొ యె సమస్యా రాష్ట్రవిభజనతొ పరిష్కారం అవుతాయి అనుకొను.

    కాని సెంటిమెంట్ కి సంబందించ్చిన విషయాలలొ తర్కం కూడదు అనేది పెద్దల మాట. అది సమస్యను మరింత జటిలం చెస్తుంది.

    తెలంగాణా సమస్యను ఇవాళ కొందరు సంకుచిత నాయకులు భుజన వెసుకున్నా, ఆ ప్రాంత ప్రజల మనోభావాలు కుడా ముడిపడి వునాయి అనెది కాదనలేని విషయం.

    ప్రజాస్వామ్యములో ప్రజల మనోబిష్టాని కాదనె హక్కు యెవరికీ లేదు. కాబట్టి తెలంగాణా యెర్పాటు చెయ్యటమె మంచిది అని భావిస్తాను.

    కాని ప్రత్యెక రాష్ట్ర యెర్పాటు చాలా క్లిష్ట్టమైన పని. నీటి నుండి ముఖ్యనగరం వరకు ఎన్నో విషయాలలొ నిర్ణయాలు తిసుకొవలసి వుంటుంది. ముందు రాష్ట్ర విభజన ప్రక్రియను ప్రారంబించి నిర్ధిష్ట సమయంలొ సామరస్యముగా అని సమస్యలకు పరిష్కరం కనుగొనాలి. ముఖ్యముగా కుటిల స్వార్దపరులు, నీచ రాజకియవాదులు, సంకుచిత వాదులను ఈ ప్రక్రియకు దురముగా వుంచటం, వారి సంకుచిత భావాలకు మద్దతు తెల్పకపొవటం ప్రజల కర్తవ్యం.

    విడిపొయినా సహొధరులుగా వుండటానికి ఎ అడ్డంకీ లెదు కద!

    ReplyDelete
  3. యెప్పటికైనా సొదరభావం, సామరస్య గుణాలె ఎ జాతికైనా వన్నె తెస్తాయి అని గురుతుపెట్టుకొవటం మంచిది.

    ReplyDelete
  4. I cant figure out how to write my comment using telugu script. Anyways, I agree with you Ajay. I can also understand Prabhakar's frustration. However what throws me off is Srujan's reply. I dont want to jump into this bashing game. But it doesn't make sense to say we cant reason on sentiment and form Telangana. If we go like this it will be 1000 states. I may ask for separate state for my home town. There is no such sentiment few years back.

    ReplyDelete