Saturday, December 12, 2009

రామాయణంలో చిక్కు ప్రశ్నలు?

నాకు చిన్నప్పటినుండీ రామాయణ మహాభారతాలంటే చాలా ఇష్టం, కానీ చిన్నప్పుడు నేను వాటిని ఒక కధలానే చూసేవాడిని, ఇప్పుడు మళ్ళీ వాటిని నిజ జీవిత కోణంలో చూడాలనిపించి చదవటం ప్రారంభించాను. అలాచదువుతున్నప్పుడు వచ్చిన అనేక ప్రశ్నలు నన్ను చాలా ఇబ్బంది పెట్టసాగాయి. వాటిలో కొన్నిటికి నాకు తోచిన జవాబులు నన్ను సంతృప్తిపరిచాయి, కానీ చాలా వాటికి జవాబులే లేవు. ఇలా నిజ జీవిత కోణంలో చదవటం తప్పని కొందరు వాదించ వచ్చు. కానీ రాముడు తాను దేముడినని చెప్పలేదు. ఇలా జీవించలని చెప్పటానికి (కీర్తికి )మాత్రమే జీవించాడనిపిస్తుంది.ఈ విదంగా చూసినప్పుడు నాప్రశ్నలకి సమాధానాలు కదలో లభించాలి. వాటిని మీతో పంచుకుంటూ, మీ అభిప్రాయాలను, నాకు తెలియని జవాబులను తెలుసుకో వాలని ఈ ప్రయత్నం

1. రాముడు బాలకాండలో అందరికీ ఇష్టమైన వాడు. అలాంటివాడు అడవులకు ఎందుకు వెళ్ళవలసి వచ్చినది? దీనికి నాకు తృప్తినిచ్చిన జవాబు, ధశరధుడి ఏకపక్ష నిర్ణయం. ధశరధుడు కైక లేదా భరతుడితో ఈవిషయం చెప్పివుంటే వారి అంగీకారంతో వారితో సభలో ప్రకటించి వుంటే రాముడికి ఈ అవస్త తప్పేది. లేదా కనీసం వశిష్ఠుడితో నైనా మంత్రాగం సాగించి వుంటే సభలోని వారి సంపూర్ణ అనుమతైనా వచ్చి వుండేది కనీసం కైక షరతులకు ధశరధుడు తలఒగ్గినప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పకపోవటం అందరూ నిర్ణయాన్ని రాజుకు మాత్రమే వదిలి వేశారనిపిస్తుంది. రాజు ఏది నిర్ణయించినా అభ్యంతరం చెప్పలేదు

అందరూ రాముడిని వేడుకున్నారేకానీ ధశరధుడిని దిక్కరించలేదు. ధశరధుడు కైకని వేడుకున్నాడే కానీ ధిక్కరించలేదు. దీనిని బట్టి ధశరధుని ఏకపక్ష నిర్ణయంలో ఎవరూ భాగస్వాములు కాలేదు


No comments:

Post a Comment